AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ రాధాకృష్ణన్ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారిని, పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం ఆయన తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌కు అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన యాదగిరిగుట్టకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు. ఆలయ అర్చకులు గవర్నర్‌కు వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత సాయంత్రం గవర్నర్ కుటుంబసమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10