AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెగా డీఎస్సీకి ప్రభుత్వం కసరత్తు

రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికషన్‌ విడుదలకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనిపై కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అలాగే టెట్ పాస్ కాని వారికి అవకాశం కల్పిస్తూ మరో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా టీచర్ల పదోన్నతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

గత ప్రభుత్వం ప్రకటించిన 5,089 పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 5089పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739, భాషా పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2575 ఉన్నాయి. 2023 ఆగస్టు వరకు ఉన్న ఖాళీగా ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌కు మరిన్ని పోస్టులను పెంచి మోగా డీఎస్సీని విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందట. ఇప్పటికే గ్రూప్ -నోటిఫికేషన్ రద్దు చేసి.. కొన్ని పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే మాదిరిగా మొత్తం 11 వేల టీచర్ పోస్టులతో ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు టెట్‌ పాస్‌ కాని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పైగా ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సమస్య కూడా టెట్‌ నోటిఫికేషన్‌ ద్వారా కొంత వరకు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు. అయితే వారం పది రోజుల్లో డిఎస్సీ నిర్వహణపై స్పష్టత వస్తుందని విద్యాశాఖ భావిస్తోంది. టెట్‌ నిర్వహించి పదోన్నతుల ప్రక్రియ పూర్తైన తర్వాత డీఎస్సీ నిర్వహించాలా లేకుంటే ఖాళీలను అంచనా వేసి.. ఆ మేరకు ముందే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలా అనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేలోపు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులు రెడీ అవుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10