వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు మంగళవారం బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర సైతం రూ.10 తగ్గి.. రూ.77,440కి చేరింది. మరోవైపు 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ.10 తగ్గి, రూ.70,990కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,140గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,590గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,990గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,440గా ఉంది.
కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,990 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 77,440గా ఉంది. ముంబయి, పుణె, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.70,990గాను.. 24 క్యారెట్ల పసిడి రూ.77,440గా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.70,900గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,440గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఈ ధరలే కొనసాగుతున్నాయి. వివిధ దేశాల్లో నెలకొన్న యుద్ధ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు..
దేశంలో వెండి ధరలు పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర రూ. 9,680గా ఉంది. కేజీ వెండి రూ.100 పెరిగి.. రూ. 96,800కి చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,02,900 పలుకుతోంది.