AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఏపీకి రెండు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుమతి ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఈ మేరకు పర్మిషన్లు మంజూరు చేసింది. దీంతో తెలంగాణలో మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతి లభించింది. ఒక్కో కాలేజీలో 50 సీట్లు కేటాయించింది. దీంతో కొత్తగా 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే ఏడాది తెలంగాణలోని నాలుగు మెడికల్ కాలేజీలు ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

8 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుల నేపథ్యంలో జూన్ మాసంలో ఎన్ఎంసీ టీమ్ తెలంగాణ వచ్చి పరిశీలన చేసి వెళ్లింది. అయితే.. ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని పేర్కొంటూ అనుమతి ఇవ్వలేదు. దీంతో టీచింగ్ స్టాఫ్, ఇతర సౌకర్యాల కోసం అవసరమైన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్లింది. దీంతో మరోసారి పరిశీలనలు చేసి ఎన్ఎంసీ ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చింది. అయితే, మిగిలిన నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదు.

మిగిలిన నాలుగు కాలేజీలకు పర్మిషన్లు తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో పని చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా రెగ్యులర్‌గా మానిటర్ చేశారు. స్టాఫ్ నియామకం, ఇతర సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టారు. అవసరమైన నిధులనూ కేటాయించారు. ఎన్ఎంసీ లేవనెత్తిన అభ్యంతరాలు, లోపాలను ఫుల్ ఫిల్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10