ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చకచకా మారుతున్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో గొల్లపల్లి వైసీపీలో చేరారు. గొల్లపల్లికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఎదుగుదల కోసం సేవలు అందించాలని సూచించారు.
ఇదే కార్యక్రమంలో పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైసీపీలో చేరారు. స్టాలిన్ కు కూడా సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు.