AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్..

బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. వీటి ధరలు మళ్లీ పడిపోయాయి. గత కొన్ని నెలలుగా బంగారం , వెండి (silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రధానంగా పండుగల సీజన్‌లో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే దీపావళి నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోల్చితే ఈరోజు ఉదయం 6.25 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు మాత్రమే తగ్గింది. మరోవైపు వెండి రేటు కూడా కిలోకు 100 రూపాయలు తగ్గింది.

నేటి బంగారం, వెండి ధరలు

ఇదే సమయానికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,990 స్థాయికి చేరుకోగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,490కి చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,140కి చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,640 చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • ముంబైలో రూ. 77,990, రూ. 71,490
  • వడోదరలో రూ. 78,040, రూ. 71,540
  • చెన్నైలో రూ. 77,990, రూ. 71,490
  • విజయవాడలో రూ. 77,990, రూ. 71,490
  • హైదరాబాద్‌లో రూ. 77,990, రూ. 71,490
  • కేరళలో రూ. 77,990, రూ. 71,490
  • ఢిల్లీలో రూ.78, 140, రూ. 71,640
  • బెంగళూరులో రూ. 77,990, రూ. 71,490
  • కోల్‌కతాలో రూ. 77,990, రూ. 71,490
  • పూణేలో రూ. 77,990, రూ. 71,490

 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 91,400
  • హైదరాబాద్‌లో రూ. 99,900
  • విజయవాడలో రూ. 99,900
  • చెన్నైలో రూ. 99,900
  • కోల్‌కతాలో రూ. 91,400
  • కేరళలో రూ. 99,900
  • ముంబైలో రూ. 91,400
  • బెంగళూరులో రూ. 91,400
  • భువనేశ్వర్‌లో రూ. 99,900
  • వడోదరలో రూ. 91,400
  • అహ్మదాబాద్‌లో రూ. 91,400

గమనిక: 

పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10