AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్.. గో బ్యాక్.. గో బ్యాక్.. నాటి దౌర్జన్యాలు మరచిపోలేదు .. గళమెత్తిన రైతన్నలు

ప్రభుత్వంలో ఉంటే మా భూములు లాక్కుంటారు.. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి.. రైతులకు అన్యాయమంటారా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను తీసుకొనేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిందన్న విషయం తెలుసుకోండి కేటీఆర్ గారూ.. మీలాగా దౌర్జన్యం చేయలేదు.. భూములు లాక్కోను కూడా లేదు.. దయచేసి మా జిల్లాకు రావద్దు కేటీఆర్.. గో బ్యాక్ కేటీఆర్ గో బ్యాక్.. అంటూ ఆ జిల్లా రైతులు ప్లెక్సీలతో కేటీఆర్ కు భారీ షాకిచ్చారు.

గత బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ రైతుల వద్ద, దౌర్జన్యంగా భూములు లాక్కున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు సంఘీభావ పేరుతో కేటీఆర్ మహబూబాబాద్ వస్తున్నసందర్భంగా అంబేద్కర్ సెంటర్లో రైతులు భారీ ఫ్లెక్సీలను కేటీఆర్ గో బ్యాక్ అంటూ ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై రైతులు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత గిరిజన రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని, నాటి ప్రభుత్వంలో భూములు కోల్పోయిన రైతులందరూ కలిసి ప్రస్తుతం కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామన్నారు. రైతులకు సంబంధించిన సాగు భూములను ప్రభుత్వ కార్యాలయాల పేరుతో దౌర్జన్యంగా లాక్కొని, నాడు రైతులపై విధ్వంసానికి కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిందని రైతులు విమర్శించారు. అంతేకాకుండా నాడు అధికారంలో ఉన్న సమయంలో రైతుల పై అక్రమ కేసులు నమోదు చేశారని, ప్రస్తుతం అధికారం లేదు కాబట్టి రైతుల కోసం ధర్నా చేస్తున్నామంటూ ప్రకటించడం మాజీ మంత్రి కేటీఆర్, బీర్ఎస్ నాయకులకు చెల్లిందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10