AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించండి: నిర్మలతో భట్టి విక్రమార్క

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి సాయం చేయాలని కోరామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా రాలేదని, వాటిని వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

2014-15లో కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించి.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం నిధులను ఏపీ ఖాతాలోనే వేశారన్నారు. తెలంగాణ వాటా నిధులు తిరిగ ఇవ్వాలనికేంద్రమంత్రిని కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులు రాష్ట్రానికి రాలేదని.. ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.

వెంటనే స్పందించి పెండింగ్ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన 8 అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపిస్తామని తెలిపారనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి నిర్మలకు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏమన్నారంటే? టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తోపాటు ఇతర అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో తమ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10