కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తవుతుంది. వంద రోజుల పాలనపై మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిబద్దతతో వంద రోజులల్లో పాలన పూర్తి చేశామని చెప్పారు. సచివాలయం, ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం కల్పించి స్వేచ్ఛ ఇచ్చామని, పూలే ప్రజా భవన్ ప్రజలకు వేదిక చేశామని రేవంత్ అన్నారు. ప్రతిశాఖలో అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చామని, వంద రోజుల్లో.. పరిపాలనను వికేంద్రీకరణ చేశాం, పారదర్శక పాలన అందిచ్చామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని రేవంత్ చెప్పారు.
గత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఇప్పుడు ఆరు గ్యారంటీలలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని, ప్రతిఒక్క హామీని అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. పన్నులు ఎగ్గొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దుబారా ఖర్చులను తగ్గించడంకూడా సంపద సృష్టించడమేనని తెలిపారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పై సీఎం ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించి జీరో బిల్లు ఇవ్వాలని విద్యుత్ రెగ్యులేటరీ నోటీస్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్ల కాలంలో కేసీఆర్ గంజాయి మొక్కలు నాటి వెళ్లారు.. ఒక్కొక్కటిగా పీకేస్తున్నాం.. ఇంకా ఉన్న వాటిని పీకేస్తాం.. మాకు లెక్కుంది అంటూ రేవంత్ పేర్కొన్నారు. తన్నీరు గుర్తుపెట్టుకో.. నీ తెలివి తేటలు మానుకో అంటూ హరీశ్ రావుకు సూచించారు. తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా చేస్తాం. వైబ్రేంట్ తెలంగాణ ఫార్ములాతో ముందుకెళ్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షలకోట్లు అప్పుల పాలు చేసింది.. వేలకోట్ల దోపిడీని శ్వేతపత్రాలతో ప్రజలకు వివరించాం. తెలంగాణ ఏర్పాటు 2014లో అప్పు ఆరువేల కోట్లు మాత్రమే ఉంది.. ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్లు భారం ప్రజలపై ఉందని సీఎం రేవంత్ తెలిపారు.