AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గణపయ్య.. నిమజ్జనం ఎలాగయ్యా?.. పీఓపీ విగ్రహాల నిమజ్జనాలను నిలిపేసిన జీహెచ్‌ఎంసీ

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాల్లేవ్‌..
ట్యాంక్‌ బండ్‌ చుట్టూ బ్యానర్ల ఏర్పాటు
అయోమయంలో మండపాల నిర్వాహకులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మహా నగరంలో గణపతి విగ్రహ నిమజ్జనాలకు ఈసారి విఘ్నాలు నెలకొన్నాయి. వినాయకచవితి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం, ఆఖరి ఘట్టం వినాయకుని నిమజ్జనం. ఈ సంబరాలు హైదరాబాద్‌ లో కోలాహలంగా జరుగుతాయి. కానీ.. గతేడాది హైకోర్టు గణేశ్‌ నిమజ్జనాలపై ఇచ్చిన తీర్పు ఆధారంగా పోలీసులు, జీహెచ్‌ఎంసీ ట్యాంక్‌ బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనాలను ఆపివేశాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తో చేసిన విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌ లో నిమజ్జనం చేసేందుకు వీల్లేదని పేర్కొంటూ.. ట్యాంక్‌ బండ్‌ చుట్టూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అలాగే ట్యాంక్‌ బండ్‌ చుట్టూ ఇనుప కంచెలను ఉంచారు. దీంతో జీహెచ్‌ఎంసీ, పోలీసుల తీరుపై గణేష్‌ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసులు మాత్రం.. పీఓపీ విగ్రహాలను సాగర్‌ లో నిమజ్జనం చేసేందుకు అనుమతించడం లేదు. బేబీ పాండ్స్‌ లోనే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెబుతున్నారు.

వ్యర్థాలు పెరుగుతుండటంతో..
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనాలతో వ్యర్థాలు పెరుగుతున్నాయని వేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. గతేడాది సెప్టెంబర్‌ 25న పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి నిరాకరిస్తూ తీర్పు చెప్పింది. దాంతో పోలీసులు, జీహెచ్‌ఎంసీ ట్యాంక్‌ బండ్‌ చుట్టూ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. మరి గణపయ్య నిమజ్జనాలకు హైకోర్టు రూట్‌ క్లియర్‌ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10