AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌దే తుది నిర్ణయం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

ప్రజాపాలనపై 50 శాతానికిపైగా ప్రజల్లో సంతృప్తి
వారిపై హైడ్రా చర్యలు తప్పనిసరి
మీడియాతో చిట్‌చాట్‌..

మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలకు మల్లు భట్టి విక్రమార్క గురువారం ఉదయం ఢిల్లీలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఇంకా రాహుల్‌ గాంధీని కలవలేదని అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వందశాతం మంది ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పారు.

చెరువులు ఆక్రమించిన వారిపై..
హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ఎవరు చెరువులను ఆక్రమించిన వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్‌లో రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని మల్లు భట్టి విక్రమార్క వివరించారు.

అసెంబ్లీ రూల్స్‌ మార్చిన బీఆర్‌ఎస్‌
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్‌ మార్చారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో రూ.64 వేల కోట్ల అసలు వడ్డీ కట్టామని తెలిపారు. రాష్టం ఏర్పడే నాటికి ఏడాదికి రూ.6400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏడాదికే రూ.64 వేల కోట్లు కట్టాల్సి వచ్చిందనిమల్లు భట్టి విక్రమార్కతెలిపారు.

పాలనపైనే దృష్టి అందుకే..
తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది అందుకే ప్రచారంలో వెనుకబడ్డామని అన్నారు. పదేళ్ల తర్వాత హాస్టళ్లకు ఇచ్చే డైట్‌ చార్జీలు పెంచామని తెలిపారు. డిసెంబర్‌ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్‌ పాలన కంటే మెరుగైన పాలన తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10