AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెక్రటేరియట్‌లో ఫేషియల్‌ అటెండెన్స్‌ షురూ..

ఉద్యోగుల సమయపాలనపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి

తెలంగాణ సచివాలయం ఉద్యోగుల అటెండెన్స్‌ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసింది. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ డిజిటల్‌ మిషన్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకు సంబంధించిన ఐడీ నంబర్లతో సహా ఫేస్‌లను మిషన్‌లో అధికారులు నమోదు చేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఫేస్‌ రికగ్నిషన్‌ కు సంబంధించి సీఎస్‌ శాంతి కుమారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఫేషియల్‌ రికగ్నేషన్‌ విధానంపైనే రోజువారి హాజరు నమోదు చేయనున్నారు. గురువారం నుంచి అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఇది వర్తిస్తోంది. ఇక నుంచి ఉద్యోగుల అటెండెన్స్‌, వారి జీతభత్యాల చెల్లింపులు ఈ అటెండెన్స్‌ ద్వారానే జరుగుతుంది.

ఉద్యోగుల ఇష్టారాజ్యంతో..
రాష్ట్ర సచివాలయం పాలన విభాగానికి గుండెకాయ లాంటిది. అయితే కొంత మంది ఉద్యోగులు సమయానికి రావడంలేదని, ఇష్టానుసారంగా వస్తున్నారని, 12 గంటల వరకు కూడా కొంతమంది రావడం లేదని.. ఒక వేళ వచ్చినా.. సాయంత్రం 5 గంటలలోపే తిరిగి వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి సర్కార్‌.. మంత్రులు కొందరు తమ శాఖల్లోని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉద్యోగులు సమయానికి రావడంలేదని తేలింది. అలా రాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ అమలులోకి తీసుకువచ్చింది. ఉద్యోగుల సమయపాలన సెక్రటేరియట్‌ భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫేస్‌ రికగ్నేషన్‌ అమలు నిర్ణయం తీసుకుంది.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10