కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక
తెలంగాణలో 3.32కోట్ల మంది ఓటర్లు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి అయినట్లు సీఈవో వికాస్ రాజ్ వెల్లడిరచారు. పోలింగ్ సమయాన్ని పెంచాలని పొలిటికల్ పార్టీల నుంచి డిమాండ్లు వచ్చాయని.. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్లు చెప్పారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడిరచారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు చెప్పారు.
ఒక్క బ్యాలెట్ యూనిట్‌లో 15 మంది అభ్యర్థులను పెట్టడానికి అవకాశం ఉదన్నారు. మూడు బ్యాలెట్ యూనిట్‌లు అవసరం పడేవి 7, రెండు ఉపయోగపడేది -9 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నట్లు చెప్పారు. 1 లక్షా 5 వేల బ్యాలెట్ యూనిట్‌లు అవసరం పడుతున్నాయిని అదనంగా 35 వేలు ఉంచామన్నారు. 15,970 సర్వీస్ ఓటర్లు ఉన్నారని.. వాళ్ల కోసం ఎలక్ట్రానిక్ మిషన్లు ఉన్నాయన్నారు.
ఎన్నికల్లో దాదాపు 2 లక్షల 95 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. 60 వేల పోలీస్, 20 వేల ఇతర రాష్ట్రాల దళాలు అందుబాటులో ఉంటాయన్నారు. 1950 టోల్ ఫ్రీ, వెబ్ బేస్ , – విజిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చనని అన్నారు. రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. తొలిసారి ఓటర్లు 9.20 లక్షలుగా వెల్లడిరచారు. 2 లక్షల 45 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేశారన్నారు. హోం ఓటింగ్ కోసం 24,974 మంది అప్లయ్ చేసుకున్నారని చెప్పారు. హోం ఓటింగ్ అప్లై చేసిన వాళ్లు ఇంటి దగ్గర అందుబాటులో ఉండాలన్నారు.