అల్లు అర్జున్, సుకుమార్ (Sukumar)కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ బెనిఫిట్ షో డిసెంబర్ 4వ తేదీన వేయగా.. హైదరాబాదులోని క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ కూడా విచ్చేశారు. అయితే కారులో అభివాదం చేసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగింది. అందులో భాగంగానే రేవతి(39) అక్కడికక్కడే మరణించింది. అయితే ఈ విషయం తెలిసిన తరువాత కూడా అల్లు అర్జున్ ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు అని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే డీజీపీ జితేందర్(DGP Jitendar) చేసిన కామెంట్లు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. “సినిమాలోనే హీరోలు. బయట మాత్రం ప్రతి ఒక్కరు పౌరులే. అందరూ చట్టానికి లోబడి ఉండాలి. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్స్ ముఖ్యం కాదు. పౌరులంతా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.
అల్లు అర్జున్ కి మేము వ్యతిరేకత కాదు.. ఆయనపై చట్ట ప్రకారమే మేము చర్యలు తీసుకుంటాము. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)పై కూడా కేసు నమోదు చేశాము. అయితే ఆయనది కుటుంబ సభ్యుల సమస్యలు. అలాగే మీడియా ప్రతినిధులపై చేసిన దాడుల విషయంలో కూడా లా ప్రకారం మోహన్ బాబు పై యాక్షన్ తీసుకుంటాము” అంటూ జితేందర్ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా చట్టం దృష్టిలో అందరూ సమానులే.. తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.