AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అక్కలు.. అన్నలు..తమ్ముళ్లు.. రైతన్నలు అందరూ.. కాంగ్రెస్‌కే ఓటేయండి

హరీశ్‌ రావు పిలుపు!
ప్రచారంలో దొర్లిన మాట
సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

(అమ్మన్యూస్‌, సిద్దిపేట):
అవాక్కయ్యారా.. అవును మీరు విన్నది నిజమే.. కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని స్వయంగా మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు దొర్లిన మాట. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ అమ్మలు.. అక్కలు.. అన్నలు.. తమ్ముళ్లు.. రైతన్నలు అందరూ కాంగ్రెస్‌కే ఓటేయండి అన్నారు. దీంతో ఆయన అన్న మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు సైతం ఈ వీడియోను రీ ట్వీట్‌ చేస్తూ ‘ఇదిగో.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మేము ముందు నుంచి ఇదే చెబుతున్నామని అంటున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బైబై అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10