తిరుమల కొండపై సందడి చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి నేడు తిరుమలలో సందడి చేశారు. శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం ఇరువురు ఆలయం వెలుపల ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా వారిని మీడియా పలకరించింది.
దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ… తాను, మాధురి ఇంకా పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. తాము పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తన భార్య వాణితో విడాకుల కేసు కోర్టులో ఉందని, అటు మాధురి కూడా భర్తతో వివాదాల నేపథ్యంలో కోర్టులో న్యాయపోరాటం చేస్తోందని దువ్వాడ వివరించారు. న్యాయస్థానాల్లో కేసులు ఓ కొలిక్కి వచ్చాక తాను, మాధురి పెళ్లి చేసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం తామిద్దరం కలిసే ఉంటున్నామని చెప్పారు.
కాగా, దువ్వాడ శ్రీనివాస్, మాధురిల తిరుమల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తిరుమల శ్రీవారి సేవలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి..!#DuvvadaSrinivas #DivvalaMadhuri #YSRCP #Tirumala #NTVTelugu pic.twitter.com/Oq6eqeADAd
— NTV Telugu (@NtvTeluguLive) October 7, 2024