(అమ్మన్యూస్, హైదరాబాద్):
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగులు డ్యూటీలో టీషర్ట్స్, జీన్స్ వేసుకోవద్దని టీఎస్ ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్‌టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్‌లోనే కార్పొరేషన్, డిపోలకు విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఆర్‌టీసీ ఉద్యోగులందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్, యూనిఫామ్‌లో రావాలని ఎండీ సజ్జనార్ సూచించారు.