AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ సన్నాసుల మాటలు నమ్మొద్దు.. ఆగం కావొద్దు

రుణమాఫీ వంద శాతం పక్కా
అర్హులందరికీ చేసితీరుతాం
ఇది రైతు ప్రభుత్వం
మోదీపై కొట్లాడుతామన్న వారు ఎక్కడ?
రాష్ట్ర సచివాలయంలో రాజీవ్‌ విగ్రహం పెట్టితీరుతాం
అడ్డుకుంటే వీపులు పగుల్తయ్‌
సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రూ.2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ సన్నాసుల మాటలు నమ్ముకొని రైతులు ఆగం కావద్దని సూచించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే ప్రధాని మోదీపై కొట్లాడుతామన్న వారు ఇప్పుడు తోకముడిచారని మండిపడ్డారు. అదానీ గ్రూప్‌ సంస్థలపై హిండెన్బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేతలు గురువారంæ ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడారు.

సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం..
కొన్ని సాంకేతిక కారణాలతో కొందరికి మాత్రమే రుణాలు మాఫీ జరగలేదని, త్వరలోనే పూర్తిగా రుణాలు మాఫీ అవుతాయని సీఎం భరోసా ఇచ్చారు. ఏ ఒక్కరికీ రుణం మాఫీ కాకపోయినా.. ఇక్కడ తాము ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దని రైతులను కోరారు.

కలెక్టర్‌ ఆఫీసుల్లో అధికారులు…
‘ఏ రైతుకి రుణమాఫీ రాకపోయినా మేం ఉన్నాం. కలెక్టర్‌ ఆఫీసుల్లో కుర్చీ వేసి ఆఫీసర్లను కూర్చోబెట్టాం. రైతు విషయంలో కొందరు దొంగ దీక్షలు చేస్తున్నారు. రైతులకు రోడ్డెక్కాల్సిన బాధ ఏమొచ్చింది? సన్నాసులను నమ్ముకొని ఆగం కావద్దు. రైతుల సమస్యలు విననప్పుడు ధర్నాలు చేయాలి. మీ సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందరపడొద్దని కర్షక సోదరులను కోరుతున్నాం. రైతుల సమస్యను ప్రభుత్వం వింటుంది. పదేళ్లు దోచుకున్న వాళ్లను, ఆరునెలల కింద బొంద పెట్టిన వారిని మళ్ళీ గ్రామాల్లోకి ఎందుకు రానిస్తున్నారు. రుణమాఫీ హామీ అమలు చేయడంతో హరీశ్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని ఇవాళ కొత్త డ్రామా మొదలు పెట్టారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సోషల్‌ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వారిపట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. రుణమాఫీ చేయడంతో బీఆర్‌ఎస్‌ నేతలకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. దీంతో అబద్ధాలకు తెరతీశారు. కేటీఆర్‌ రుణమాఫీ విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వారు రూ.లక్ష రుణం మాఫీ చేయడానికే ఆపసోపాలు పడ్డారు. అప్పటికీ అందరికీ పూర్తి చేయలేదు. కానీ మేం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణాలను మాఫీ చేశాం’ అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.
వారిని జైలుకు పంపేవరకు పోరాడుతాం..
అదానీ, అంబానీతో సహా మోదీ తన పరివారాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జేపీసీ వేయాలంటూ పార్లమెంట్లో డిమాండ్‌ చేస్తే మోదీ తప్పించుకు తిరిగారని.. ప్లాన్‌ ప్రకారం నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్‌ను వాయిదా వేశారని మండిపడ్డారు. చేశ సంపదను అప్పనంగా దోచుకున్న వారిని పక్కాగా జైలుకు పంపే వరకు పోరాడతమని అన్నారు. మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పు రూ.55 లక్షల కోట్లని.. నేడు అదే అప్పును రూ.1.55 లక్షల కోట్లకు చేర్చి దేశాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు.

రాజీవ్‌ గాంధీ విగ్రహం పెట్టి తీరుతాం..
తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పెట్టి తీరుతామని.. సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. దీనిని ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వారి వీపులు పగుల్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి. బీఆర్‌ఎస్‌ నేతలు గత పదేళ్లలో తెలంగాణ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని మండి పడ్డారు. డిసెంబర్‌ 9 వ తేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశం మొత్తాన్ని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు ఇద్దరు.. అంబానీ, అదానీలకు దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. సెబీ అక్రమాల గురించి కేసీఆర్, కేటీఆర్‌ లు ఎందుకు మాట్లాడడడం లేదని సీఎం రేవంత్‌ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10