AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తొలగింపు కుదరదు.. ఇకపై వద్దు.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తేల్చిచెప్పిన హైకోర్టు

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జీవో 16ను హైకోర్టు కొట్టేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. జీవో 16 ద్వారా వేలాది మందిని గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది.

విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. హైకోర్టు ఆర్డర్‌తో వారంతా ఆందోళనలో ఉన్నారు. రెగ్యులరైజ్‌ అయినవారిని తిరిగి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు చెబుతున్నారు. కోర్టు ఆర్డర్‌ కాపీ వస్తే స్పష్టత వస్తుందదని అధికారులు అంటున్నారు.

సెక్షన్‌ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను హైకోర్టు కొట్టివేసిందని చెబుతున్నారు. గతంలో డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల లెక్చరర్లను సర్కారు క్రమబద్ధీకరించింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వారిని క్రమబద్ధీకరించారని నిరుద్యోగులు గతంలో హైకోర్టులో సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని అన్నారు. దీనిపైనే విచారణ చేపట్టిన హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10