ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన జైలు జీవితం అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ హైకోర్టులో ఆమె వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కాగా కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు ఈడీ సమయం కోరింది. ఈ నేపథ్యంలో 24 వరకు బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై నమోదయిన మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 6న రౌస్ అవెన్యూ కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తుది ఉత్తర్వులను హైకోర్టులో కవిత సవాల్ చేశారు. ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.