(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారు ఢిల్లీలో చోరీకి గురైన కారు ఆదివారం వారణాసిలో ప్రత్యక్షమైంది. మార్చి 19న చోరీకి గురైన విషయం తెలిసిందే. నడ్డా భార్య మల్లికాకు చెందిన ఫార్చునర్ ఎస్‌యూవీ కారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోరీకి గురైంది. డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీసింగ్ సెంటర్ నుంచి దాన్ని తీసుకొచ్చారు. కారు డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీసింగ్ సెంటర్ నుంచి తీసుకొచ్చారు. కారును వారణాసిలో గుర్తించిన పోలీసులు జేపీ నడ్డా వ్యక్తిగత సిబ్బందికి సమాచారం చేరవేశారు.