టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేక పరిచం అక్కర్లేదు. తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇక ధోనీ హెయిర్ స్టైల్ (hairstyle) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఎప్పుడూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో అభిమానుల్ని ఖుషీ చేస్తుంటాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో లాంగ్ హెయిర్‌తో ఉన్న ధోనీ.. ఇప్పుడు కొత్త లుక్ (new look)లోకి మారిపోయాడు.
హెయిర్ మొత్తం కట్ చేసి యంగ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. చాలా స్టైలిష్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ యాక్టర్‌లా కనిపిస్తున్నాడు. ధోనీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకిమ్ (Aalim Hakim) తన ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ‘హాలీవుడ్ హీరోలా ఉన్నావ్..’, ‘లుక్ అదిరిపోయింది..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మైదానంలో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ధోనీ.. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కేవలం ఐపీఎల్ (IPL) సీజన్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నారు. ఐపీఎల్ మినమా మిగతా టైమ్‌లో తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం కేటాయిస్తుంటారు. ఇక ధోనీ నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.