AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాప్‌రే.. ధరణి స్కామ్‌.. రూ. 60వేల కోట్లు.. గత ప్రభుత్వంలో భూములన్నీ అన్యాక్రాంతం

ప్రభుత్వ భూములన్నీ స్వాహా!
ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు
విచారణ జరపాలని రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగుల సంఘం లేఖ

బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అక్రమాలు అన్నీఇన్నీకావు.. విస్తూపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ధరణి పోర్టల్‌ ద్వారా కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని తాజాగా రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని సీఎం రేవంత్‌ కు లేఖ రాశారు.
ధరణి పోర్టల్‌ సాక్షిగా..
గత ప్రభుత్వం భూముల రికార్డుల కోసం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌ పై అనేక ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధరణిపై సంచలన స్కామ్‌ బయటకు వచ్చింది. కొంత మంది రెవెన్యూ అధికారులు, ఉన్నత అధికారులు ఈ ధరణి పోర్టల్‌ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని.. చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించారాని ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతులోకి వెళ్ళాయాని రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. ఈ భూదందాపై విచారణ జరిపించాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్, సీఎం రేవంత్‌ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తో పాటు పలు విచారణ ఏజెన్సీలకు లేఖ రాసినట్లు సమాచారం.

1000 ఎకరాల వరకు…
రంగారెడ్డి జిల్లా గుట్టల బేగంపేటలోని సర్వే నంబర్‌ 63లోని 42ఎకరాలు, గోపనపల్లి గ్రామంలో సర్వే నంబర్‌ 124/10లో 50 ఎకరాలు, సర్వే నంబర్‌ 36, 37లో 600 ఎకరాలు, హఫీజ్‌పేట సర్వే నెంబర్‌ 80లో 20 ఎకరాలు, మోఖిలా దగ్గర సర్వే నంబర్‌ 555లో బిల్లాదాఖల భూములు 150 ఎకరాలు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, కూకట్‌పల్లి మండలం యల్లమ్మబండ(షాంబిగూడ) పరిధిలో సర్వే నెంబర్‌ 57లో 92 ఎకరాలను చట్టవిరుద్ధంగా విక్రయించారని విజిలెన్స్‌ కమిషన్‌కు రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు రాసిన లేఖలో పేర్కొన్నారు. చేతులు మారిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10