AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇళయరాజా పాత్రలో ధనుష్ ఎలా ఉన్నాడో చూడండి!

మ్యాస్ట్రో ఇళయరాజా జీవితకథ ఆధారంగా బయోపిక్
ఇళయరాజా పాత్ర పోషిస్తున్న ప్రముఖ హీరో ధనుష్
చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం

ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా జీవితగాథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం పేరు ఇళయరాజా. ఇందులో ఇళయరాజా పాత్రను ప్రముఖ హీరో ధనుష్ పోషిస్తున్నారు. తాజాగా ఆయన మేకోవర్ కు సంబంధించిన స్టిల్ విడుదలైంది. ధనుష్ దాదాపు ఇళయరాజాను తలపించేలా ఉన్నారు.

నిన్న చెన్నైలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ బయోపిక్ కు అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ధనుష్-అరుణ్ మాదేశ్వరన్ కాంబినేషన్ లో కెప్టెన్ మిల్లర్ వచ్చింది. ఈ జోడీ ఇళయరాజా బయోపిక్ కోసం మరోసారి కలిసింది. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యురీ మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10