హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. శ్రీరామ జయరామ నామ స్మరణతో కొండగట్టు క్షేత్రం మార్మోగింది. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా కొండంతా కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో కాషాయవర్ణ శోభితమైంది. జయంతి సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.