AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విధ్వంసమే కాంగ్రెస్ గ్యారంటీ: ప్రధాని మోడీ

విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. విధ్వంసం కాంగ్రెస్ గ్యారంటీ అంటూ కామెంట్స్ చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ శుక్రవారం హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జ‌రిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓవైపు కాంగ్రెస్ విధ్వంస మోడ‌ల్‌ ఉందని, మ‌రోవైపు మోడీ గ్యారంటీల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటంలో ప్రజ‌లు ఏ ప‌క్షం వ‌హిస్తారో తేల్చుకోవాల‌ని సూచించారు. అధికారం కోసం కాంగ్రెస్ అదే ప‌నిగా అస‌త్యాల‌ను ప్రచారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. అధికారం కోసం పూట‌కో మాట చెప్పే కాంగ్రెస్‌ను విశ్వసించ‌వ‌ద్దన్నారు. అగ్ర కులాల్లోనూ పేద‌లు ఉంటార‌ని, వారికీ రిజ‌ర్వేష‌న్లు అవ‌స‌ర‌మ‌ని కాంగ్రెస్‌కు 60 ఏండ్లుగా తెలియ‌లేద‌ని దుయ్యబ‌ట్టారు. ఈ కులాల గురించి కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించ‌లేద‌ని, మోడీ వ‌చ్చిన త‌ర్వాతే అగ్రవ‌ర్ణాల్లోని పేద‌ల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించార‌ని ప్రధానమంతకరి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10