AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఢిల్లీ సుల్తానుల పంచన చేరి.. అభివృద్ధిని అడ్డుకున్నారు’

బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా పాలమూరు ప్రాజెక్టు పూర్తికాలేదని విమర్శించారు. శుక్రవారం మక్తల్‌లో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభకు రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ధనదహానికి బలైందని విమర్శించారు. జిల్లా నుంచి కృష్ణా జలాలు వెళ్తున్న ఇక్కడి భూములను ఎడారి చేశారని మండిపడ్డారు. ఇక్కడి కొందరు నేతలు ఢిల్లీ సుల్తాన్‌లకు బానిసలయ్యారని కామెంట్స్ చేశారు. పాలమూరును అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారని, డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల పంచన చేరారన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తానే పాలమూరుకు రైల్, పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత నాదేనని అన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు.. మీ రిజర్వేషన్ల రద్దుపై తీర్పు అవుతుందన్నారు. మోడీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాడని, మనుషుల మధ్య చిచ్చు పెడుతాడన్నారు. బీజేపీ చిమ్మిన విషంతో ఉత్తరప్రదేశ్ సర్వ నాశనమైందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం విధ్వంసమవుతుందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని కషాయ పార్టీ నేతలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10