AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు

కరీంనగర్‌ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు ఫిర్యాదు

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌): హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు అయ్యింది. వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పురుషోత్తం, ఆశిష్‌ గౌడ్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

పోలీసులపై ఇటీవల బెదిరింపు ధోరణినితో కౌశిక్‌ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్‌ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసు నమోదు అయ్యింది.

కౌశిక్‌ రెడ్డి ఏమన్నారంటే…
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులతో ఏమీ అయ్యేది లేదు.. తేలేది లేదు. మల్లా మేం వచ్చిన తర్వాత బిడ్డా మిత్తితో సహా వసూలు చేస్తాం. జాగ్రత్తగా ఉండుండ్రి. జిల్లాలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుండ్రు. తస్మాత్‌ జాగ్రత్త. ఎవరినీ వదిలిపెట్టం. మీరు భయపెట్టిస్తే.. భయపడేటోళ్లు లేరు. మేం అన్యాయం చేసేటోళ్లం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఇబ్బంది పెడ్తుండ్రు. మీరు కూడా జైలుకు పోయే రోజులు వస్తాయ్‌.. రాసి పెట్టుకోండ్రి’’ అంటూ పోలీసులను ఉద్దేశించి ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10