సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ (CPI Leader Narayana) ప్రమాదవశాత్తు జారి పడటంతో గాయపడ్డారు. ఈనెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ సీపీఐ నేత జారి పడిపోయారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ… ఈ ఘటన అనంతరం విశాఖపట్నం, చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. నారాయణకు చికిత్స చేసిన వైద్యులు రెండు వారాల పాటు విశ్రాంతి అవసమని చెప్పారు. ఆ సందర్భంలో నొప్పి ఎక్కువ కావడంతో ఏఐజీ డాక్టర్లను సంప్రదించగా రిబ్ ఎముక విరిగినట్లు డాక్టర్లు నిర్ధారించి రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని తెలిపారు. ప్రస్తుతం నారాయణ హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.