రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుబంధ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
జులై 6 నుంచి 16 వరకు ఆన్ లైన్ లో ఈ పరీక్షలను నిర్వహించారు. 73,342 మంది అభ్యర్థులు అప్లై చేయగా, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన కీ ను కూడా అధికారులు ఇటీవలే విడుదల చేశారు.
ఫలితాలను సంబంధిత ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్, పుట్టిన తదితర వివరాలను అందులో ఎంటర్ చేసి ర్యాంక్ కార్డును పొందొచ్చు.