AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కిషన్ రెడ్డి, బండి మాటలకు బీజేపీలో విలువ లేదు.. జగ్గారెడ్డి ఫైర్

బీజేపీ, బీఆర్‌ఎస్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. సిద్ధాంతాలు చెప్పే పార్టీలు డూప్లికేట్ పార్టీలని దుయ్యబట్టారు. మాట మీద నిలబడి కట్టుబడి ఉన్నది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సిద్ధాంతాలు లేవన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందంతోనే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని చెప్పారని, ఆ రెండు పార్టీలు కలిసి కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు బీజేపీలో విలువ లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని అంటే చెప్పుతో కొట్టండి అనే డైలాగులకు కూడా విలువ లేదని, కాంగ్రెస్ ఓట్లు చీలి బీజేపీ, బీఆర్‌ఎస్‌కు లబ్ది అనుకుంటే కవితను అరెస్ట్ చేస్తారని జోస్యం చెప్పారు. కవిత అరెస్ట్ చేస్తే సింపతి వచ్చి ఓట్లు డైవర్ట్ అవుతాయని వాళ్ళు అభిప్రాయం పడుతున్నారని తెలిపారు.

కవిత అరెస్టు దాకా పోయి ఆగిందని, అంటేనే బండి మాటకు విలువ లేదు అని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. కవిత అరెస్ట్ ఎపిసోడ్ రాహుల్ గాంధీ ప్రధాని కావద్దని కుట్రలో బీఆర్‌ఎస్ పార్టీ ఒక పావుగా తయారైందని అన్నారు. రాహుల్ గాంధీ అంటే పిచ్చి అని, గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయడం కోసం నిర్విరామంగా పని చేస్తానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించింది తెలంగాణపై ప్రేమ మీద కాదని, రాజకీయ లబ్ధి కోసమని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎక్కడా లేదని, కనీసం ఎంపీగా గెలిచి లేడని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడింది కాంగ్రెస్ ఎంపీలు అని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడాని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10