లోక్ సభ ఎన్నిలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా 14మంది ఎంపీ అభ్యర్థులతో 8వ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి మరో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్ నుంచి టి.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సుగుణ, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ పోటీ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు అయ్యింది.
మరో 4 స్థానాలు.. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ సీట్లను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్. ఆ స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, 8వ జాబితాలో జార్ఖండ్ నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 3, ఉత్తరప్రదేశ్ నుంచి 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.