AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యార్థుల ఉన్నతి కోసమే కామన్ డైట్.. ఉప ముఖ్యమంత్రి భట్టి

రాష్ట్రంలో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేలా ప్రజా ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఉప ముఖ్యమంత్రి, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలిసి మధిర నియోజకవర్గం బోనకల్ లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బ్యాండ్ మేళాలు, వాయిద్యాలు వాయిస్తూ జిల్లా అధికారులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.

ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. కామన్ డైట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని డిప్యూటీ సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ… మానవ వనరులే రాష్ట్రంలో బలమైన వనరులని, వీరి అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. రేపటి తెలంగాణ భవిష్యత్తు నేటి విద్యార్థులపై ఆధారపడి ఉందని, విద్యార్థులు బలమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యవంతంగా ఎదిగే దిశగా ప్రజా ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకుందన్నారు.

ప్రపంచంతో పోటీపడే విద్యార్థులను తయారు చేసేందుకు ప్రజా ప్రభుత్వం దృడ నిశ్చయంతో అడుగులు వేస్తుందని, మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లల దేహా దారుఢ్యం, మేదస్సు ఎదుగుదల నమోదు అవుతుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యం చేసి డైట్ చార్జీలను గణనీయంగా పెంచి, నూతన డైట్ ప్రవేశ పెట్టామన్నారు. ప్రభుత్వం తమ కోసం ఉందనే నమ్మకం చదివే పిల్లలకు, తల్లిదండ్రులకు కలగాలని ఉద్దేశంతో కామన్ డైట్ లంచ్ కార్యక్రమం చేపట్టామని, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10