మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఆదివారం వెళ్లారు. ‘అల్లుడు ఎలా ఉన్నావ్’ అంటూ చింరజీవి పరామర్శించారు. వీళ్లిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి చంచల్‌గౌడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రాత్రంతా జైల్లోనే బన్నిని ఉంచి మరుసటి రోజు శనివారం విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో బన్ని ఇంటికి చిరంజీవి వెళ్లి పరామర్శించారు. ఆదివారం చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. ఎలా ఉన్నావ్ అల్లుడు అంటూ చిరంజీవి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
రాత్రంతా జైల్లో..
అల్లు అర్జున్ 13 గంటలు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అరెస్టయిన రోజు రాత్రి జైలు క్యాంటీన్లో వండిన ఎగ్ఫ్రై డ్ రైస్ తిన్నారు. రాత్రిపూట చలితో ఇబ్బందిపడ్డారు. చాలాసేపు మెలకువగానే ఉన్న ఆయన, అర్ధరాత్రి తర్వాత నిద్రపోయారు. ఎక్స్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి కేసులో శుక్రవారం అరెస్టయి రిమాండ్ ఖైదీగా సాయంత్రం 5:30 గంటలకు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. శనివారం ఉదయం 6:30 గంటలకు మధ్యంతర బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్టయిన గంటలోనే హై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. బెయిల్ పత్రాలు సమయానికి ఆన్ లైన్లో అప్లోడ్ కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో విడుదల జాప్యమైంది. జైల్లో అల్లు అర్జున్ను అధికారులు అండర్ ట్రైయల్ ఖైదీ నంబర్ 7697 కేటాయించి మంజీరా బ్యారక్‌లో గట్టి బందోబస్తు మధ్య ఉంచారు. జైలు అధికారులు అల్లు అర్జున్‌కు తొలుత చాయ్, బిస్కెట్లు ఇచ్చారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న సమాచారం మేరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పెషల్ కేటగిరి సదుపాయాలు కల్పించాల్సి ఉండటంతో ఆయనకు ఒక బెడ్, కుర్చీ ఏర్పాటు చేశారు.
Allu Arjun family arrives at Chiru residence pic.twitter.com/r3t6wO6VDq
— PSPK UK FAN (@pspk_uk) December 15, 2024