AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినిమా హబ్‌గా మార్చాలన్నదే సీఎం లక్ష్యం.. ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు సంచలన వ్యాఖ్యలు

ఇంటర్నేషనల్‌ స్థాయిలో పనిచేయాలని సూచించారు
తెలుగు సినిమాపై సీఎం విజన్‌ ఏంటో చెప్పారు..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (టీఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ సూచించారని తెలిపారు. ఇంటర్నేషనల్‌ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలంటూ సీఎం తమకు సూచించారని తెలిపారు. హైదరాబాద్‌లో హాలీవుడ్‌ సినిమాల షూటింగ్స్‌ కూడా జరగాలని అన్నారు. అందుకు సంబంధించి సలహాలు, సూచనలను తమ నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ను ఇంటర్నేషనల్‌ సినిమా హబ్‌గా మర్చాలన్నదే సీఎం ఆలోచన అని తెలిపారు.

సమావేశమై చర్చిస్తాం..
త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులంతా సమావేశమై ఆ అంశాలపై చర్చిస్తామని దిల్‌రాజ్‌ అన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని సీఎం సూచించనట్లుగా ఆయన వెల్లడించారు. టికెట్‌ ధరలు , బెనిఫిట్‌ షో ల అంశం చాలా చిన్నదని.. ఇండస్ట్రీ అభివృద్ధే తమ ముందు ఉన్న అతిపెద్ద లక్ష్యమని అన్నారు. ఊహించిన ఘటన వల్ల ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి కొంత గ్యాప్‌ వచ్చిందని ఎఫ్‌ఎసీ చైర్మన్‌గా తాను ఈ భేటీకి చొరవ తీసుకున్నానని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై 15 రోజుల్లో పూర్తి నివేదిక అందజేస్తామని దిల్‌ రాజ్‌ స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10