తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు నా వెంట్రుక కూడా అంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ”అడవి పందిలా పదేళ్ల పాటు తెలంగాణను సర్వనాశనం చేశారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు. మీ కాలు విరిగిందని, మీ కూతురు జైలుకి పోయిందని కొంతకాలం మేము సంయమనం పాటించా. అలా అని.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అని గుర్తు పెట్టుకో బిడ్డా. మా కార్యకర్తలతో జాగ్రత్త” అంటూ చెలరేగిపోయారు సీఎం రేవంత్ రెడ్డి.
”నీ లత్కోర్ మాటలకు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నువ్వు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు. నేను మాత్రం నీకు తప్పకుండా చర్లపల్లి జైల్లో డబుల్ డెబ్ రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డా.. నీ కొడుకు, కూతురు, అల్లుడు, నువ్వు.. అందరూ కలిసి ఉండేలా జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా” అని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.