కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం అయ్యేందుకు సీఎం రేవంత్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.
అలాగే ఉత్సవాలకు హాజరుకావాలని ఏఐసీసీ పెద్దలను కోరనున్నట్లు సమాచారం. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు హాజరుకావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్ పదవులు, మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.