రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై పలికారు. వీరి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతి కుమారి అధికారులు పాల్గొన్నారు. నగర శివారులోని శాంతి వనంలో నిర్వహించే ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సమ్మేళనంలో భారత్ సహా వందకు పైగా దేశాల నుంచి దాదాపు మూడు వందల మంది ప్రఖ్యాత సర్వమత గురువులు తరలి వచ్చారు. రేపు జరగనున్న కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ విశిష్ట అతిధిగా హాజరుకానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.