ఆమె వారసులకు సముచిత గుర్తింపు కల్పిస్తామన్న సీఎం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడీల వ్యవస్థపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ఐలమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతేగాక ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని అశిస్తూ.. ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నిమయమిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ క్రమంలో మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వీరనారి చాకలి ఐలమ్మ పేరును కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె వారసులకు సముచిత గుర్తింపును కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.