AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆయనేమైనా సైనికుడా?.. సరిహద్దుల్లో యుద్ధం చేసి వచ్చారా?.. అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై సినీ, రాజకీయ ప్రముఖులు ఏకమై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాస్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..

‘ఈ దేశంలో హీరోలు సల్మాన్ ఖాన్, సంజీవ్ దత్ లాంటి స్టార్స్ ఎందుకు అరెస్ట్ అయ్యారు. దేశంలో చట్టం ముందు సామాన్యుల నుండి ప్రధాని వరకు అందరూ సమానులనే దానికి అర్థం. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు మేమే అనుమతిచ్చాం. కేవలం 300 రూపాయలు ఉన్న టికెట్ ధరను దానిని వెయ్యి రూపాయలకు పెంచుకునే విధంగా అనుమతి కూడా ఇచ్చాం. కానీ సరైన ఏర్పాట్లు సరైన సమాచారం లేకుండా సడన్ గా అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు. ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ఇప్పటికీ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. అందుకే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత కూడా కేసు నమోదు చేయలేదంటే.. సినిమా వాళ్ల కోసం ప్రత్యేక రాజ్యాంగం లేదా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? అంటూ మీరే ప్రశ్నిస్తారంటూ సమాధానం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తమ దృష్టిలో అక్కడ నేరం జరిగిందా? లేదా? అనేది ముఖ్యం తప్ప. ఆయన స్టార్.. సెలబ్రేటా.. అనేది సంబంధం లేదు’ అంటూ ఫైర్ అయ్యారు.

అలాగే.. అల్లు అర్జున్ కార్లో వచ్చే సినిమా చూసి వెళ్లిపోలేదు. పర్మిషన్ లేకుండా కార్లో నుండి బయటకు వచ్చి రోడ్ షో నిర్వహించారు. పైగా కారు ఎక్కి చేతులు ఊపుతూ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టారు. ఈ సందర్భంలోనే అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరి ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? బాధ్యత ఎవరు తీసుకోవాలి? అంటూ ఘాటుగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ సొంత సినిమా.. అది ఆయన తన సొంత థియేటర్లలో ఇంట్లో కూర్చొని కూడా సినిమా చూడవచ్చు. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇలా జనాలకు మధ్యకు వచ్చి థియేటర్లలో సినిమా చూడాలంటే కనీసం ముందస్తు సమాచారం ఇవ్వాలి కదా అంటూ నిలదీశారు.

అలాగే థియేటర్ యజమాన్యం కూడా ఈ విషయంలో సరైన ఏర్పాట్లు చేయాలి కదా అంటూ సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ ఇంకా ఏదైనా విషయంలో అరెస్ట్ చేశారా అని ప్రశ్నించగా.. అల్లు అర్జున్ తనకు చిన్నప్పటినుండి తెలుసు అని, తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి అని, అతడు ఒకప్పటి కాంగ్రెస్ లీడర్, అలాగే అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ నేత పైగా ఆయన తనకు బంధువు అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ బంధాలు బంధుత్వాలు కాదు.. చట్టం ముందు అందరూ సమానులనే చెప్పడానికి అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా వాళ్లు సినిమాలు తీస్తున్నారు.. డబ్బులు సంపాదిస్తున్నారు అంతేగా.. వాల్లేమీ సరిహద్దుల్లోకి వెళ్లి భారత్ కోసం యుద్ధాలు చేయడం లేదు కదా.. విజయాలు తెచ్చిపెట్టడం లేదు కదా.. ఏంటి వాళ్ల ప్రత్యేకత అంటూ ప్రశ్నించారు. వాళ్ళేం ప్రత్యేకంగా గొప్పేం కాదు. పైసలు పెట్టి సినిమాలు తీస్తున్నారు. సంపాదించుకుంటున్నారు అంతే కదా.. వాళ్లు కూడా అందరిలాగే సమానమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఏ హీరో అంటే మీకు అభిమానమని ప్రశ్నించగా.. తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే అభిమానం అని, కానీ ప్రస్తుతం ఎవరు లేరని చెప్పారు. ప్రస్తుతం తనకు తానే సూపర్ స్టార్ అంటూ తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10