AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్.. ఘ‌ట‌న‌పై సీఎం సీరియ‌స్.. క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేసి కీల‌క ఆదేశాలు

నారాయ‌ణపేట జిల్లా మాగ‌నూరు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం విక‌టించి విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థ‌త‌కు గురికాగా 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘ‌ట‌న‌పై క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నారు. అంతే కాకుండా విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీసి, నిర్ల‌క్ష్యం వ‌హించిన వారిని స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించారు. బాధిత విద్యార్థుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. విద్యార్థుల‌కు పౌష్ఠికాహారం అందించే విష‌యంలో రాజీప‌డేదిలేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు పునారావృతం అయితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హెచ్చ‌రించారు. ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక జిల్లా క‌లెక్ట‌ర్ మ‌రియు సీఎంవో అధికారుల‌ను ఆదేశించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూద‌ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను సీఎం అప్ర‌మ‌త్తం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘ‌ట‌న‌లు త‌రచూ చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏళ్లు గ‌డుస్తున్నా ప్ర‌భుత్వ హాస్ట‌ళ్లు, స్కూల్స్ ప‌రిస్థితి మాత్రం మార‌డంలేదు.

నాణ్య‌మైన భోజ‌నం అంద‌క‌పోవ‌డంతో విద్యార్థులు పౌష్ఠికాహార‌లోపంతో బాధ‌ప‌డుతున్నారు. మరోవైపు పాడైపోయిన కూర‌గాయాలు, డేట్ అయిపోయిన వంట సామాగ్రితో వంట‌లు చేయ‌డంతో విద్యార్థులు అనారోగ్యం బారిన ప‌డుతూ ఆస్ప‌త్రుల పాల‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల డైట్ ఛార్జీలు పెంచుతూ మెస్ నిర్వాహ‌కుల‌ను హెచ్చ‌రించారు. ఆహారం నాణ్య‌త త‌గ్గినా, ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంతో ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10