తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన చిన్నజీయర్ స్వామి.. సమతా కుంభ్-2024 శ్రీ రామానుజచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను చిన్న జీయర్ స్వామి ఆయనకు అందించారు.