ఆర్మూర్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో అనూహ్య పరిణామం ఎదురైంది. చేవెళ్ల పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు అయ్యింది. భూ కబ్జా చేశారని జీవన్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు. జీవన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు భూ కబ్జా చేశారంటూ సామ దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ భూమికి పంజాబ్ వాళ్లకు కాపలా ఉంచారని, ప్రశ్నించేందుకు వెళ్లితే తన అనుచరులతో దాడి చేయించారని పేర్కొంటూ దామోదర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అతని ఫిర్యాదు మేరకు చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది.