ఢిల్లీ మంద్యం కుంభకోణంపై సీబీఐ నోటీసులు పంపించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు సీబీఐ విచారణ హాజరు కావడం లేదని లేఖ రాశారు. ఈ మేరకు ఆదివారం విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని చెప్పారు. సీఆర్పీసీ నోటీసులు సరికాదని, 2022లో దర్యాప్తు అధికారి ఇలాంటి నోటీసులు సెక్షన్ 160 కింద ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో పంపించిన నోటీసులకు ప్రస్తుతం పంపించిన నోటీసులు పూర్తి విరుద్ధమని తెలిపారు. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారో స్పష్టత లేదని, నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా సరికాదని అన్నారు.
నిబంధనల ప్రకారం సీబీఐ విచారణకు ఎప్పుడైనా సహకరిస్తానని, వర్చువల్‌గా హాజరుకావడానికి అందుబాటులో ఉంటానని లేఖలో ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 41 ఏ నోటీసులు రద్దు చేయాలి.. లేదా.. ఉపసంహరింకోవాలని అన్నారు. అందే విధంగా 15 నెలలు తర్వాత ఇప్పుడు విచారణకు పిలువడం అనుమానాలకు తవునిస్తోందన్నారు. వచ్చే ఆరు వారాల పాటు ఎన్నికల షెడ్యూల్ ఖరారైందని, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఆరు వారాలు బిజీగా ఉంటానని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.