తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ వెబ్‌నోట్ జారీ చేసింది. 2022లో గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. పేపర్ లీక్ కారణంగా ఒక్కసారి ప్రిలిమ్స్ రద్దు అయ్యింది రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్ రద్దయ్యాయి. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఉద్యోగాలు, నోటిఫికేషన్లపై ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా కొత్తగా 60 పోస్టులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కమిషన్ యోచిస్తున్నది.