బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు కవిత ఇంట్లో సుమారు 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో కవితకు అరెస్ట్ వారెంట్ వారెంట్ ఇచ్చిన ఈడీ అధికారులు… ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై కాసేపట్లో ఈడీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయటకు తీసుకొస్తే… ఆమెను నేరుగా ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.