AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖాకీ దుస్తుల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. ఆటోలో వచ్చిన కేటీఆర్‌..

ఆటో డ్రైవర్లకు సంఘీభావం..

ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ.. ఖాకీ చొక్కాలు ధరించి బుధవారం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఆటోలను స్వయంగా కేటీఆర్, గంగుల కమలాకర్, బండారి లక్ష్మారెడ్డి లు డ్రైవింగ్‌ చేశారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

93 మంది ఆత్మహత్య..
కాగా, ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని అన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బీఆర్‌ఎస్‌ పక్షాన వారికోసం పోరాడతామని స్పష్టం చేశారు.

వాయిదా తీర్మానం
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ ముందుచూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10