మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుల ముష్టిఘాతాలు
ఆస్పత్రి సిబ్బందిపై పిడిగుద్దుల వర్షం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తయశోద ఆసుపత్రిలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరులు హంగామా సృష్టించారు. చిలుకా ప్రవీణ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడిని పరామర్శించేందుకు జగదీశ్‌రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లారు. ఈ సమయంలో భద్రతా సిబ్బందికి, మాజీ మంత్రి అనుచరులకు మధ్య గొడవ జరిగింది. సిబ్బందిపై ఆయన అనుచరులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. జగదీశ్‌రెడ్డి అనుచరులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో వీరంగం సృష్టించారు.
అసలేం జరిగిందంటే..
చిలుక ప్రవీణ్‌కుమార్ అనే యూట్యాబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడ్ని సోమాజీగూడ ఆస్పత్రిలో చేర్పించారు. అతన్ని పరామర్శించేందుకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేతలు వచ్చారు. జగదీశ్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ యశోదా ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మమ్మల్ని అడ్డుకుంటారా అక్కడి స్టాఫ్‌పై చిందులేశారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరులు. జగదీశ్‌రెడ్డి సైతం అక్కడే ఉన్నారు.
ఆసుపత్రి సిబ్బందిపై..
ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ మంత్రి అనుచరులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు వర్షం కురిపించారు. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు యశోద సిబ్బంది. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నేతల దాడి దృశ్యాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.