మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి కొన్ని బోగీలు విడిపోయాయి. మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, గూడ్స్ గార్డ్ అప్రమత్తమై వాకీటాకీ ద్వారా లోకో పైలట్ కు సమాచారం ఇచ్చాడు. దీంతో రైలు బోగీలు విడిపోయినట్లు గుర్తించిన లోకో పైలట్ గూడ్స్ రైలు నిలిపివేశాడు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను అధికారులు నిలిపివేశారు.
డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు వేగంగా వెళ్తుంది. మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రైలు వెనుక భాగంలోని కొన్ని బోగీలు విడిపోయాయి. దీంతో విడిపోయిన బోగీల వేగం తగ్గింది. సిగ్నల్ పడకుండానే రైలు వేగం తగ్గడంతో గార్డ్ కు అనుమానం వచ్చి చూడగా రైలు బోగీల మధ్య లింక్ తెగిపోవడాన్ని గమనించాడు. వెంటనే వాకీటాకీ ద్వారా లోకో పైలట్ కు సమాచారం అందివ్వడంతో అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్లను అధికారులు నిలిపివేశారు.
రైల్వే అధికారులు, సిబ్బంది ఘటన స్థలం వద్దకు చేరుకొని బోగీలను వదిలి ముందుకెళ్లిన గూడ్స్ రైలును వెనక్కి తీసుకొచ్చి విడిపోయిన బోగీలకు లింక్ కలిపారు. ఆ తరువాత రైలును పంపించారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాల పాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు గార్డ్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పినట్లయింది. అయితే, ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపిస్తామని, రైలు నుంచి బోగీల లింక్ తెగిపోవటానికి కారణాలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, రైల్వే బోగీలు విడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
तेलंगाना: महबूबाबाद स्टेशन के पास एक मालगाड़ी के दो हिस्सों में टूट जाने के कारण ट्रेन परिचालन करीब 45 मिनट तक बाधित हो गया। रेलवे अधिकारियों ने मौके पर पहुंचकर टूटे हुए डिब्बों को फिर से जोड़ा, जिसके बाद ट्रेन परिचालन सामान्य हो गया। pic.twitter.com/YmsGlqeuGQ
— IANS Hindi (@IANSKhabar) December 3, 2024