వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు సిద్ధమైంది. మెజార్టీ ఎంపీ సీట్లు గెలువడమే లక్ష్యంగా మంగళవారం నుంచి బీజేపీ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టబోతుంది. వీలైనన్ని ఎక్కువ సీట్లతోపాటు హైదారాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యాత్రకు సంబంధించిన ప్రచార రథాలు గోడ పత్రికలు, కరపత్రాలను హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. జనసందేశ్ డిజిటల్ పత్రికను కూడా కిషన్ రెడ్డి ప్రారంభించారు.
కాగా, కిషన్ రెడ్ సమక్షంలో బీజేపీలో చేరారు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర మంగళవారం (ఫిబ్రవరి 20న) నుంచి ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో రెన్యూసిస్ ఇండియా భారీ పెట్టుబడులు ఐదు క్లస్టర్లుగా విభజించి 17 పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ నేతలతంతా విస్తృతంగా పర్యటిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. విజయ సంకల్పయాత్రల్లో అస్సాం, గోవా ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నట్లు చెప్పారు.